![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-118 లో... రామలక్ష్మి నీ అందాన్ని సొంతం చేసుకుంటానంటూ అభి తన చెయ్యి పట్టుకొని బలవంతం చేయబోతుంటాడు. మరొకవైపు సీతాకాంత్, రామలక్ష్మి కోసం వెతుక్కుంటూ వాళ్లున్న దగ్గరికి వస్తాడు. రామలక్ష్మికి తను కట్టిన రక్ష సీతాకాంత్ కి కన్పిస్తుంది. అక్కడే రామలక్ష్మి పట్టీ దొరుకుతుంది. అది చూసి వెంటనే సీతాకాంత్ లోపలికి వెళ్తాడు. దాంతో సీతాకాంత్ ని రామలక్ష్మి చూసి హగ్ చేసుకుంటుంది.
రామలక్ష్మి జోలికి రాకని చెప్పినా వినలేదు కదా అంటూ అభిని సీతాకాంత్ కొడుతుంటే.. రామలక్ష్మి ఆపి.. మీరు అలాంటి వాడి చావుకి కారణం కాకూడదని చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మిని తీసుకొని సీతాకాంత్ బయల్దేరతాడు. ఆ తర్వాత మధ్యలో ఆపి పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలనుకున్నావ్ కదా.. ఇక వెళ్ళు ఢిల్లీలో కోచింగ్ తీసుకో.. ఇదిగో ఫ్లైట్ టికెట్ ఇంకా డబ్బులు.. డెబిట్ కార్డు అని సీతాకాంత్ చెప్తాడు. అది కాదని రామలక్ష్మి ఏదో చెప్పబోతుంటే.. నువ్వేం అంటావో నాకు తెలుసు.. నన్ను అందరు తప్పుగా అనుకుంటారని ఆలోచిస్తున్నావా అలా ఏం లేదు.. ఎన్నైనా భరించే శక్తి నాకుందని సీతాకాంత్ అంటాడు. వెళ్ళు రామలక్ష్మి క్యాబ్ కూడా వచ్చిందని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత సందీప్, శ్రీలతలు కలిసి శ్రీవల్లికి ఏదో ప్లాన్ చెప్తారు. రామలక్ష్మి, సీతాకాంత్ ఇంకా రావట్లేదని అందరు టెన్షన్ పడతారు. అప్పుడే సీతాకాంత్ ఒక్కడే వస్తాడు. నువ్వు ఒక్కడివే వస్తున్నావ్? రామలక్ష్మి ఎక్కడ అని మాణిక్యం, సుజాత ఇద్దరు అడుగుతారు. అపుడే అభి రామలక్ష్మి ఉన్న ఫోటోలు శ్రీవల్లి తీసుకొని వచ్చి.. ఇవి రామలక్ష్మి గదిలో దొరికాయని అంటుంది. అంటే ప్రేమించినవాడితో లేచిపోయిందని శ్రీవల్లి అంటుంది. ఇక ఏం తెలియనట్టు నీ కూతురు ఇలా చేసిందంటు మాణిక్యాన్ని శ్రీలత తిడుతుంది. నా కూతురు అలాంటిది కాదని సుజాత చెప్తుంది. సీతాకాంత్ సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |